యూపీలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 150 మంది
బ్రాహ్మణులు తాము ఇస్లాం మతంలోకి
మారతామంటూ
హెచ్చరిస్తున్నారు. ఈ నెల
8న
ఆ
వర్గానికి
చెందిన
ఓ
బాలికను
దళిత
వర్గానికి
చెందిన
ఓ
యువకుడు
కిడ్నాప్
చేసినట్లు
సింఘావలీ
అహిర్
గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు
ఫిర్యాదు
చేయడంతో
కేసు
నమోదు
చేసి
దర్యాప్తు
చేస్తున్నారు. అయితే వారం రోజులైనా
బాలిక
ఆచూకీ
తెలియకపోవడంతో వారు మండిపడుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు 150 మంది
బ్రాహ్మణులు మంగళవారం ఏఎస్పీ విద్యా
సాగర్
మిశ్రాను
కలిశారు.
దళిత
యువకుడు
కిడ్నాప్
చేసి
వారం
రోజులైనా
తమ
బాలిక
ఆచూకీని
పోలీసులు
కనిపెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం
చేశారు.
బాలికను
తమకు
తిరిగి
అప్పగించని పక్షంలో తామంతా ఇస్లాం
మతంలోకి
మారతామంటూ
బ్రాహ్మణులు హెచ్చరించారు. ఇదే అంశంపై
సోమవారం
జిల్లా
కలెక్టర్
కార్యాలయం
ఎదుట
గ్రామస్తులు ధర్నా చేశారు. అధికారులు
స్పందించకపోతే తాము సామూహికంగా ఇస్లాం
మతంలోకి
మారతామంటూ
కలెక్టర్కు
ఓ
వినతి
పత్రం
కూడా
అందజేశారు.
మరోవైపు
బాలిక
ఆచూకీని
కనిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి పోలీసు అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment