|
తన కూతురు షీనా బోరా హత్య కేసులో కోర్టు కస్టడీలో ఉన్న ఇంద్రాణీ మఖర్జీని బ్రిటీష్ బృందం మంగళవారం కలిసింది. ఇంద్రాణీ ముఖర్జీ గత కొంతకాలంగా బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ పౌరురాలైన ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు, జైల్లో వసతులు గురించి అడిగి తెలుసుకునేందుకు ఆ దేశానికి చెందిన ఓ బృందం ఇంద్రాణీని కలిసింది. అయితే జైల్లో ఉన్న ఆమెను కలిసేందుకు ముంబైలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ బృందానికి మొదట అనుమతి లభించలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తగిన అనుమతి కావాలని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ అధికారులను ముంబై బృందం సంప్రదించిన తర్వాత జైల్లో ఉన్న ఇంద్రాణిని కలిసేందుకు వారికి అవకాశం లభించింది.
|
No comments:
Post a Comment