రవితేజ హీరోగా, తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన సినిమా ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది.
నిర్మాత మాట్లాడుతూ ‘షూటింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని రూపొందించాం. రవితేజ యంగ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సంపత్‌నందికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. భీమ్స్ అందించిన పాటలను అక్టోబర్‌లో విడుదల చేస్తాం’’ అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నాం. ఆడియన్స్ రవితేజగారి నుంచి ఏం కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. బోమన్ ఇరాని నటన హైలైట్ అవుతుంది’’ అని చెప్పారు.
బ్రహ్మానందం, రావు రమేశ్ సాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సి నిమాకు కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతంరాజు.


No comments:
Post a Comment